10-09-2025 12:01:32 AM
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
-దేశం ప్రమాదపుటంచును ఉంది: భాగం హేమంతరావు
-సురవరం స్పూర్తితో ముందుకు సాగాలి
-ఘనంగా సురవరం సుధాకరరెడ్డి సంస్మరణ సభ
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 9, (విజయక్రాంతి):కమ్యూనిజానికి అంతం లేదు, కమ్యూనిస్టులకు మరణం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ మంగళవారం కొత్తగూడెం క్లబ్లో జ రిగింది.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూల మాలలువేసి నివాళ్ల ర్పించారు. జిల్లా జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాష అధ్యక్షతన జరిగిన ఈ సభలోసంతాపతీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. అనంత రం కూనంనేని మాట్లాడుతూ సురవరం జీ వితంతెరిచిన పుస్తకం అన్నారు. విద్యార్ధి దశలోనే ఏఐఎస్‌ఎఫ్ జెండాను చేతబూతి వి ద్యారంగసమస్యలపై గళం ఎత్తిన సుధాకర్ రెడ్డి యువజన నాయకునిగా, వ్యవసాయ కార్మిక సంఘంనేతగా, సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎదిగారని చెప్పారు.
తొలినాళ్ల నుం డి ప్రశ్నించేతత్వం ఉన్న ఆయన చట్టసభల్లో ప్రజావ్యతిరేక విధానాలపై గళమెత్తి పాలకులను నిలదీసేవారని చెప్పారు.పార్లమెంట్ స భ్యునిగా రెండు పర్యాయాలు ప్రజలచే ఎ న్నుకోబడ్డ ఆయన నల్గొండ జిల్లా ఫ్లోరైజ్ స మస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమించారని చెప్పారు. 83 ఏళ్లపాటు జీవించిన ఆయన 64 సం.లుగా ప్రజాజీవితాన్ని గడిపారన్నారు.
ఆయన భౌతికకాయాన్ని సంద ర్శించేందుకురెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు ప్రాంతాలకు చెందిన అన్ని పార్టీల నాయకులు సైతం తరలివచ్చారని, రాగద్వేషాలకు తావులేకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద ఎత్తునప్రచారాన్ని, ప్ర సారాలు చేశాయన్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో భారతకమ్యూనిస్టు పార్టీ వందేళ్ల పాటుమనగలుగుతోందని, మరో వందేళ్లయినా ఇవే సిద్ధాంతాలతో ప్రజాశ్రేయస్సు, సంక్షేమం, కార్మికకర్షక, వ్యవసాయ కూలీలు హక్కులు, మహిళా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుందన్నారు.
అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హే మంత రావు మాట్లాడుతూ దేశం ప్రమాద పు అంచులో ఉందని, దేశాన్ని పాలిస్తున్న మతతత్వ బిజేపి ప్రజలపై అప్రకటితయుద్ధాన్ని సాగిస్తోందని చెప్పారు. ప్రజాస మస్యలపై గళమెత్తుతున్న వారిని నిర్భందాల పాలుచేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని, ఇలాంటి వారిని ఎదురించ గల్ల సత్తా ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని, అందుకే నేడు ప్రపంచం మొత్తం కమ్యూనిస్టులనుకోరుకుంటుందన్నారు.
ఈ కార్య క్రమంలో సిపిఐ ఎంఎల్ మాజీ ఎంఎల్‌ఎ గుమ్మడి నర్సయ్య, సిపిఎం జిల్లానాయకులు అన్నవరపు సత్యనారాయణ, మాస్ లైన్ నాయకులు అవునూరి మధు మట్లాడుతూ కమ్యూనిస్టులు చనిపోయినప్పటికీ ధృవతరాల్లో వినీలాకాశంలో వెలుగుతూనే ఉంటారని, వారి పోరాటాలు, స్పూర్తి నిరంతరం వారిని గుర్తు చేస్తునే ఉంటాయని అన్నారు. ప్రజాక్షేత్రంలో కమ్యూనిజం ఎప్పుడూ వాడిపోదని, కమ్యూనిస్టు నాయకులు నిరంతర జీవించే ఉంటారన్నారు.
అనంతరం పినపాక ఎంఎల్‌ఎ పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో ఓనమాలు నేర్చుకున్న తాను నేడు ఎంఎల్‌ఎ స్థాయికి చేరానని, దానికి కమ్యూనిస్టు పార్టీ ద్వారా పడ్డ మూలాలే అన్నారు. వైరా ఎంఎల్‌ఎ రాష్రస్ నాయక్ మాట్లాడుతూ కమ్యూనిస్టులు ప్రజల కోసంబ్రతికే వారని, వారిని చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నామని, వారికి సమస్యల పరిష్కారం తప్ప పదవులతో పనిలేదన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరివెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు కే సా రయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి,నరాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివా స్, చండ్రా నరేంద్ర, వై ఉదయ్ భాస్కర్ తో పాటు గ్రంధాలయచైర్మన్ పసుపులేటి వీరబాబు, సొసైటీ చైర్మన్ మండె వీరహనుమంతరావు, మల్లెల రామనాధం,టిడిపి నాయకులు అనంత రాములు టిపిసిసి సభ్యులు నాగసీతారాములు తదితరులు పాల్గొన్నారు.