calender_icon.png 22 November, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

17-08-2024 05:52:08 PM

మంచిర్యాల, (విజయ క్రాంతి): శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణ కాలనీలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సింగరేణి క్వార్టర్స్ లో  తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఓ సంతోష్ కుమార్ కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , గ్రామంలో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని అన్నారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీ లో మరింత రక్షణ కోసం సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని, ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆత్మ హత్యలు, లైంగిక వేదింపులు, గంజాయి వంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాల పై, వివిధ చట్టాలపై ప్రజలను చైతన్యం చేస్తూ  షీ టీమ్ , డయల్ 100 గురించి అవగాహన కల్పించారు. సరైన వాహన పత్రాలు, నెంబర్ ప్లేట్ సరిగా లేని 30 ద్వీచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఎస్ఐలు, ఏఎస్ఐ, 20 మంది పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గోన్నారు.