17-08-2024 05:59:30 PM
సుడాకు రావలసిన రెవెన్యూ విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు
అక్రమార్కులకు నోటీసులు జారీ చేయాలన్న సుడా చైర్మన్
కరీంనగర్, (విజయక్రాంతి): సుడా పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇరవై రెండు వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, టిఎస్ బిపాస్ పర్మిషన్లు, అభివృద్ధి పనులపై చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రవుల్ దేశాయ్ తో కలిసి సమీక్ష చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంభందించి పూర్తి వివరాలు సేకరించాలని హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని దరఖాస్తుదారులను సంప్రదించి ప్రదేశాలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
టిఎస్ బిపాస్ ద్వారా పొందిన పర్మిషన్లలో అవకతవకలు ఉంటే నోటీసులు జారీచేసి సరిచేయాలని పేర్కొన్నారు. సుడాకు చెల్లించాల్సిన రుసుము వసూలు విషయంలో నిక్కచ్చిగా ఉండాలని అదేవిధంగా అవసరమైన చోట అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. అత్యవసర పనులు ఎక్కడెక్కడ అవసరమో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిపివో రవీందర్, సిపివో కోటేశ్వరావు, డిటిసిపి ఆంజనేయులు, ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ రొడ్డ యాదిగిరి, ఏఈ రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.