calender_icon.png 30 October, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక్కో రైతుకు రూ.20,000 నష్ట పరిహారం అందించాలి

30-10-2025 05:50:58 PM

మాజీ ఏఎంసీ ఛైర్మన్ పత్తిపాక వెంకటేష్

ధర్మపురి (విజయక్రాంతి): తెలంగాణలో కురుస్తున్న మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ వెల్గటూర్ మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్ డిమాండ్ చేశారు. పంట నష్ట సర్వే నిర్వహించి నష్టపోయిన పత్తి, వరి రైతులకు భూమితో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు 20,000 చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. వడ్లు ఆరబెట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధిహామీ పథకంలో చేర్చాలనీ, తద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తడిసిన ప్రతీ గింజను ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ ఆయన డిమాండ్ చేశారు.