28-05-2025 12:30:03 AM
రేవల్లి, మే27: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసభ్యంగా సంబోధిస్తూ మాట్లాడినందుకు మంగళవారం రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ పిర్యాదు చేశారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ మీ పాలనను చూసి రాష్ట్ర ప్రజలు మూడవసారి అధికారంను దూరం చేసింది.
ఈ అహంకారం వల్లనే అనేది మర్చిపోవద్దని, చిన్న,పెద్ద తేడా తెలుసుకొని మాట్లాడితే మీకు గౌరవం దక్కుతుందని వారు హితువు పలికారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాడల పర్వతాలు, బాదేపల్లి సురేష్ గౌడ్, జమ్మి మల్లేష్ సుధాకర్ యాదవ్,సురేష్ యాదవ్,నాగిరెడ్డి, కాసిమ్ ,బాల్ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.