28-05-2025 12:27:30 AM
జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ
గద్వాల, మే 27 ( విజయక్రాంతి ) : మంగళవారం ఐడీఓసీ తమ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శిక్షణ పొందుతున్న లైసెన్స్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ శిక్షణ కిట్లను అం దజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం భూమి హక్కుల రికార్డులను పారదర్శకంగా నిర్వహించేందుకు లైసెన్స్ సర్వేయర్లను ప్రారంభించిందని పేర్కొన్నారు.
శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ప్రాక్టికల్ పనితీరులో నైపుణ్యం కలిగి ఉండేందుకు, ఈ కిట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో థియరీతో పాటు ఫీల్ ట్రైనింగ్ కూడా ఉన్నందున,అభ్యర్థులు కష్టపడి నేర్చుకోవాలని సూచించారు. భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ వంటి ప్రక్రియల్లో సర్వే మ్యాప్లు తప్పనిసరిగా ఉండడంతో, గ్రామీణ ప్రాంతాల్లో లైసెనస్డ్ సర్వేయర్ల ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.
ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పరీక్ష,అనంతరం లైసెనస్డ్ సర్వేయర్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ శాఖ ఏ.డి.రామ్ చందర్,శిక్షణ పొందుతున్న అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.