26-01-2026 12:23:22 AM
ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్, జనవరి25 (విజయక్రాంతి): బోరబండ మోతి నగర్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ టీవీ, మూవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వసభ సమావేశానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన యూ నియన్ అధికారిక వ్బుసైట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రహ్మత్ నగర్ కార్పొరేటర్ సి.ఎన్. రెడ్డి, యూనియన్ అధ్యక్షుడు రాజశేఖర్, నూకరాజు, అంతయ్య, పలువురు సినీ-టీవీ కళాకారులు పాల్గొన్నారు.