calender_icon.png 9 May, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాకిస్థాన్‌కు దీటైన జవాబు చెప్పిన భారత జవాన్లు

08-05-2025 01:04:37 AM

- ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మే 7 (విజయక్రాంతి) : జమ్మూకశ్మీర్ పహల్గామా పర్యటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భారత జవాన్లు ధీటైన జవాబు చెప్పారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత జవానులు జరిపిన మెరుపు దాడులకు హర్షం వ్యక్తం చేస్తూ, భద్రతా దళాలకు సంఘీభావం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్ జాతీయ జెండాలను చేతబూని ముషీరాబాద్ లో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకి జై... జై జవాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రాఫెల్స్తో పాకిసా న్లోని 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడంతో పాటు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుపెట్టడం పై దేశంలోని ప్రతి పౌరుడు గర్విస్తున్నారని అన్నారు.

మన దేశ జవాన్లు జరిపిన దాడులకు పాకిస్తాన్ దేశం బెంబేలెత్తిపోతుందని పేర్కొన్నారు. మతం పేరుతో ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహా, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, సీనియర్ నాయకులు దీన్ దయాల్ రెడ్డి, టెంట్ హౌస్ శ్రీనివాస్, ఎండీ మోహిన్, జావిద్ ఖాన్, పరుశురాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి కాలనీలో మాక్ డ్రిల్‌పై అవగాహన

పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత జవాన్లు దాడి జరపడంతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఏర్పడిన ఉద్భిక్ష పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బుధవారం నగరంలో నిర్వహించిన మాక్ డ్రిల్ పై అవగాహన కల్పిస్తూ భోలక్ ప్పూర్ పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఇంటి తలుపులు మూసి, విద్యు త్ సరఫరా నిలిపివేశారు. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో కాలనీ అంతా నిర్మాణుశంగా మారింది. సుమారు 45 నిమిషాలపాటు కాలనీ వాసులంతా తమ ఇండ్లలోనే ఉన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న మాల్ పై కాలనీ వాసులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలి పారు.

కాలనీలోని సుమారు 400 కుటుంబాలు ఇండ్లలో నుంచి బయటకు రాకుండా తలుపులు మూసుకున్నారని తెలిపారు. యుద్ధం వస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిం చామన్నారు. ఈ కార్యక్ర మంలో సొసైటీ అధ్యక్షుడు సుందర్ పఠాలే, నాయకులు శ్రీనివాస్, కమల్ కుమార్ శర్మ, సుజాత, ఉమా తదితరులు పాల్గొన్నారు.