calender_icon.png 5 August, 2025 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలానుగుణంగా మారని కామ్రేడ్లు

31-12-2024 12:00:00 AM

కన్నోజు శ్రీహర్ష :

ఒక రష్యా విప్లవం, ఒక ఇటలీ విప్లవం, ఒక  కార్మిక విప్లవం నుండి ఉద్భవించిందే ఈ కమ్యూనిస్ట్టుల పార్టీ. బ్రిటిష్ రాచరిక పోకడలకు, భారతదేశంలో ఉన్న తీవ్రమైన పేదరికం, బానిస త్వాన్ని గురించి ప్రశ్నించడానికే పుట్టింది ఈ కమ్మూనిస్టుల పార్టీ. అధికారికంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన పార్టీ తొలి మహాసభలో ఏర్పాటయింది.

కానీ అంతకు ముం దే  దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు పలువురు నేతలు ప్రయత్నించారు. 1920 లో ఎంఎన్ రాయ్ ఆధ్వర్యంలో సోవియట్ యూనియన్‌లోని (ప్రస్తుతం ఉజ్బెకి స్తాన్‌లోని) తాష్కెంట్ ప్రాంతంలో భారత కమ్మూనిస్టు పార్టీని ప్రారంభించడం జరిగింది. శతజయంతి సంవత్సరంలోకి అడు గిడిన భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్య్ర ఉద్యమంలో  ప్రముఖ పాత్ర పోషించింది.

ఆ తదనంతరం క్రియాశీలక రాజకీయాల్లో  విప్లవ పార్టీగా ఒక ఊపు ఊపిన కమ్యూనిస్టులు ఈరోజు పూర్తిగా నీరుగారిపోయా రు. 1952లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, నేడు పార్లమెంట్‌లో కేవలం 4 స్థానాలకే పరిమితం అవడంతో భారతదేశ ప్రజలు  పూర్తిగా లెఫ్టిస్ట్ భావజాలాలకు స్వస్తి చెప్పారని అనుకోవచ్చు. పార్టీకి ఆ దుస్థితి ఎందుకు వచ్చిందో ఓ సారి సింహావలోకనం చేసుకుందాం.

1925లో ఏర్పడిన పార్టీ, అతి కొద్దీ రోజుల్లోనే ప్రజల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల వారు లెఫ్టిస్ట్ సిద్ధాంతాల వైపు అడుగులు వేశా రు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ఆ రోజు జాతీయ కాంగ్రెస్‌లో ఉన్నత కులాల వారి ఆధిపత్యమే ఉన్నందున, కొంతవరకు బ్రిటిష్ వారికి సహకరించడం వల్ల అనేక దేశభక్తి ఉన్నవాళ్లు, రాడికల్ సంఘాల వాళ్లు కమ్యూని స్టుల వైపు మొగ్గారు.

చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్, లాల్ హర్ దయాల్, ఎస్ ఏ డాంగే లాంటి వారు కమ్మూనిస్టుల భావజాలాలను అందిపుచ్చుకున్నారు. ఆసియా ఖండంలో రష్యా (ఒక్కప్పటి యూఎస్‌ఎస్‌ఆర్) అతి పెద్ద దేశంగా ఉండేది. బ్రిటిష్ రాజ్యాన్ని ముచ్చెమటలు పట్టించేది. దీని తో చాలా మంది దేశభక్తులు కమ్యూనిస్టుల వైపు నిలబడి ఉద్యమం చేసారు. అనే క దేశాల్లో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు.

1929లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యంతో పశ్చిమ దేశాలు నష్టపోవడంతో రష్యా, లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు మరింత గా బలోపేతం అయ్యాయి. బ్రిటీష్ ప్రభు త్వం తమ వ్యా పారాలను పెంచుకోవడం కోసం ఇక్కడ ఉన్న చిన్న, సన్నకారు పరిశ్రమలను  నష్టాలకు గురి చేసాయి.

లాలా లజపత్ రాయ్, నారాయణ్ మల్హర్ జోషి నేతృత్వంలో జాతీయ కార్మిక సమాఖ్యను (ఏఐటీయూసీ)ఏర్పాటు చేయడం జరిగింది. నేటికీ ఈ సంస్థ కార్మికులకు అండగా వారి డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్త్తోంది. ఈ విధంగా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకంగా కమ్యూనిస్టు పార్టీ వ్యవహరించింది.

కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా.. 

 1949లో చైనా దేశంలో మావో శకం ప్రారంభమైన తర్వాత, లెఫ్టిస్ట్ సిద్ధాంతాలు, కమ్యూనిస్టు పార్టీ మరింత బలంగా మా రింది . 1952 ఎన్నికల తర్వాత భారతదేశ రాజకీయం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలుగా మారిపోయింది. 1952లో కేరళ రాష్ట్రంలో మొదటిసారి కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం జరిగింది.

భూమి హక్కులు, భూస్వామ్య విధానాలను రద్దు చేయడం, మధ్యవర్తి విధానాలను తీసివేయడం లాంటి వాటిపై జాతీయస్థాయిలో కమ్యూనిస్టులు పోరాటం చేశారు. వీరి ఒత్తి డి మేరకు భారత ప్రభుత్వం  జేసీ కుమారప్ప కమిటీని భూ సంస్కరణల కోసం నియమించారు. హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టులు చేసిన రైతాంగ పోరాటం స్ఫూర్తిదాయకం.

దీని ప్రభావం వల్ల నల్లగొండ నియోజకవర్గం నుండి 1952లో రావి నారాయణ్ రెడ్డి  3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలుపొందడం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ పొందిన మెజారిటీ కన్నా ఇది ఎక్కువ.  తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం బలం గా ఉండేది.

1967లో జరిగిన ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో మొదటిసారి కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. జ్యోతిబసు, బర్దన్, రావి నారాయణ్‌రెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, మాకినేని బసవపున్న య్య లాంటివారు దేశంలో కమ్యూనిస్టు పార్టీ వ్యాప్తి చెందడంలో కీలకంగా వ్యవరించారు.

పేదరిక నిర్మూలన, భూపంపిణీ, ఉచిత విద్య, పరిశ్రమల ప్రభుత్వీకరణ చేయడం లాంటివి కమ్యూనిస్టుల ఒత్తిడి, వారి భావజాలం కారణంగానేనని రాజకీయ విశ్లేషకులు ఆ రోజు భావించారు. 

మారిన సిద్ధాంతాలు, మొదలైన పతనం 

1962లో రష్యా చైనా యుద్ధం అనంతరం కమ్యూనిస్టు సిద్ధాంతాలు రెండుగా చీలిపోయాయి. సీపీఐ, సీపీఐ(ఎం)గా మారాయి. 1967లో బెంగాల్‌లో ప్రభు త్వం భూస్వామ్య విధానాలు అమలుచేయడంలో జాప్యం కావడంతో చారు మజుం దార్, కాను సన్యాల్ లాంటి వారు బయటకి వచ్చి సీపీఐ(ఎం) అనే కొత్త పంథాను ఎంచుకున్నారు.

ఆయుధాలతోనే ఆశయం నెరవేరుతుందని భావించి  రాడికల్ పం థా వైపునకు కమ్యూనిస్టు విధానాలు మారి చివరికి నక్సలిజానికి దారి తీసింది. 1970 నుండి 1980 దశకం మధ్య దేశంలోని 13 రాష్ట్రాలో నక్సలిజం వ్యాపించిం ది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ఏజన్సీ ప్రాం తాల్లో బలంగా వ్యాప్తించింది.

సీపీఐ (ఎం)సైతం అనేక చీలికలకు దారితీసింది. ఎవరికి నచ్చినట్టు వారు ప్రత్యేక దళాన్ని ఏర్పరుచుకొని నక్సలిజాన్ని ముందుకు తీసుకువెళ్లారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు నక్సలిజాన్ని నిర్మూలించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

ఎన్నికలు బహి ష్కరించడం వలన కమూనిస్టులు చాలా చోట్ల గెలుపును అందిపుచ్చుకోలేక, అటు ఉద్యమాన్ని నడపలేక నీరుగారుతూ వస్తున్నారు. 1985 తర్వాత మార్కెట్ సంస్కరణ లు, 1991లో నూతన భారత ఆర్థిక విధానాల (ఎల్‌పీజీ) వలన లెఫ్టిస్ట్, సోషలిస్ట్ విధానాలకు ప్రభుత్వాలు స్వస్తి చెప్పడం మొదలైంది.

ప్రజలు సైతం లెఫ్టిస్ట్ విధానాల నుండి ప్రపంచీకరణ వైపు అడుగు లు వేశారు. బాబ్రీ మసీదు ఉదంతం, అద్వానీ రథయాత్ర తర్వాత దేశంలో రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒకపుడు కాంగ్రెస్,కమ్యూనిస్టులుగా ఉన్న రాజకీయం  1990 దశకం నుండి  కాంగ్రె స్,  బీజేపీగా మారిపోయింది. 

నేటి యువ త కొత్త ఆలోచలనతో ముందుకు సాగుతోంది. హిందుత్వ భావజాలం దేశంలో పెరిగింది. బెంగాల్, త్రిపుర లాంటి కమ్యూనిస్టుల కంచుకోటలో సైతం బీజేపీ  బలం గా దూసుకుపోయింది. మారిన విధానాలు, ఆర్థిక అంశాలు సైతం కమ్యూని స్టుల పతనానికి దారి తీసింది .

నూతన ఆలోచనలు అవసరం

కమ్యూనిస్టులు ఇప్పటికైనా చైనా దేశం సిద్ధాంతాలను పూర్తిగా మద్దతు పలకకుండా మారిన దేశ రాజకీయాల ఆలోచనలతో ముందుకు సాగాలి. మహిళలు, బడు గు బలహీనవర్గాలకు, కార్మిక, కర్షకులకు  ఒక్కపుడు వెన్నుదన్నుగా ఉన్న కమ్యూనిస్టులు నేడు తమ విధానాలను వారికి అనుకూలంగా మలుచుకోవాలి.

సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న పార్టీలకు మ ద్దతు తెల్పడం, పొత్తు రాజకీయాలు మానాల్సిన అవసరం ఉంది. దేశంలో కమ్యూనిస్టులు వారి పూర్వపు లెఫ్టిస్ట్ భావాలను మార్చుకొని నేటి రాజకీయాలకు అనుగుణంగా ప్రజలకు ఏం కావాలో దాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్తే పార్టీ బలోపేతం అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

వ్యాసకర్త సెల్: 895130032