calender_icon.png 12 September, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగ్‌మోహన్ సింగ్‌కు శుభాకాంక్షలు

12-09-2025 01:26:20 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కొత్తగా నియమితులైన బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జగ్‌మోహన్ సింగ్‌ను బీజేపీ రాష్ర్ట మాజీ అధికార ప్రతినిధి మీర్ ఫిరసత్ అలీ బక్రీ, అల్కా మనోజ్ ఉపాధ్యక్షుడు హకీమ్ తైయేబి మర్యాదపూర్వకంగా కలిశారు. మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఫిరసత్ అలీ బక్రీ మాట్లాడుతూ.. బిజెపి రాష్ర్ట అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. జగ్‌మోహన్ సింగ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మైనారిటీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. తన సామర్థ్యాలను నమ్మినందుకు పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు.