12-09-2025 01:27:26 AM
మల్కాజిగిరి, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం గురువారం జరగాల్సిన ఉండగా. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా 11గంటలకు రావా ల్సిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మధ్యాహ్నం తర్వాత మీటింగ్ కి రాకపోవడం పై స్థానిక ప్రజల్లో అసంతృప్తి, నిరాశలకు కారణమైంది.
ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు, పరికరాల లభ్య త, సిబ్బంది నియామకాలు వంటి కీలక అం శాలపై చర్చించడానికి ఏర్పాటుచేసిన ఈ సమా వేశంలో ప్రజాప్రతినిధి సమయానికి హాజరుకాలేదని ఆరోగ్య కార్యకర్తలు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్య లు, ఆసుపత్రి అభివృద్ధి విషయాలను ప్రత్యక్షంగా వినడానికి అవకాశం కోల్పోయినట్లు పలువురు భావిస్తున్నారు. ఎమ్మెల్యే సమయానికి హాజరై సమస్యలు వింటే త్వరగా పరిష్కారం దిశగా వెళ్లేవి అని వ్యాఖ్యానించారు.