calender_icon.png 26 January, 2026 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహానేత డాక్టర్ బీఆర్ అంబేద్కర్

26-01-2026 02:49:29 AM

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ 

ఘట్ కేసర్, జనవరి 25 (విజయక్రాంతి): భారతదేశాన్ని ఒక గొప్ప రాజ్యంగా రూపకల్పన చేసిన మహానేత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో  బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ఆదివారం ఘట్ కేసర్ పట్టణంలో 250వవారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించారు.

ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్, గౌరవ అతిథిగా పద్మశ్రీ నర్రా రవి కుమార్ స్థాపకుడు, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ స్థాపకులు, జాతీయ అధ్యక్షుడు (డిక్కీ) విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారతదేశాన్ని ఒక గొప్ప రాజ్యంగా రూపకల్పన చేసిన మహానేత డాక్టర్ అంబేద్కర్ అని అనేక విధాలైన వైవిధ్యాలతో, కులాలు, మతాలు, వర్గాలతో నిండిపోయిన దేశం మనదన్నారు.

ఈ సమస్త అంశాలను సమగ్రంగా దృష్టిలో పెట్టుకొని, ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా సమానత్వం, ఆత్మీయత, మానవత్వం నిండిన రాజ్యాంగాన్ని రూపొందించిన ఘనత ఆ మహనీయుడు అంబేద్కర్ కే చెందుతుందన్నారు.  పద్మశ్రీ నర్రా రవికుమార్ మాట్లాడుతూ ప్రబుద్ధ భారత అంతర్జాతీయ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరోజూ నిత్యపూలమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీనిని స్ఫూర్తిగా తీసుకొని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో 100కు పైగా ప్రాంతాల్లో నిత్యపూలమాల కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. 

అందరూ భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం హక్కులని ప్రజల్లో తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, ఎంఆర్ పిఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మీసాల మల్లేష్, బిజెపి అధ్యక్షులు కె. మహిపాల్ రెడ్డి, జిల్లా నాయకులు విక్రమ్ రెడ్డి, కాలేరు రామోజీ, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగరావు, మాజీ సర్పంచ్ స్టీవెన్, మాజీ ఉప సర్పంచ్ బోనకుర్తి అర్జున్, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముధిరాజ్, నాయకులు కొంతం అంజిరెడ్డి, కట్కూరి నర్సింగ్ రావు, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఇరిటపు శ్రీనివాస్, గుండ్ల బాల్రాజ్, యువ మోర్చ అధ్యక్షులు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.