15-08-2025 12:22:17 AM
పోటాపోటీగా నినాదాలు
నాగల్ గిద్ద, ఆగస్టు 14 : నాగల్ గిద్ద మండలంలోని కారస్ గుత్తి గ్రామంలో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పోటాపోటీ నినాదాలు చేశారు. డీఎస్పీ, సీఐలు, ఎస్త్స్రల బందోబస్తు మధ్య ఇరు పార్టీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మేత్రే పండరి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, మాటల్లో తప్ప అభివృద్ధి జరగలేదని, 420 హామీలు వెంటనే అమలు చేసి స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.
మండల పార్టీ అధ్యక్షులు మేత్రి పండరి, గ్రామ అధ్యక్షులు సుభాష్ రావు పాటిల్, మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు నందు పాటిల్, సీనియర్ నాయకులు అంజిరెడ్డి, శ్రీధర్ రావు పటేల్, గుణవంత్ మలిపాటిల్ ,సంజీవ్ యాదవ్, మాజీ సర్పంచులు అశోకరావు పాటిల్, విఠల్ రావు పాటిల్, శివరామ్, సద్దాం, శ్రీకాంత్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ సమావేశం...
నాగల్ గిద్ద మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సచిన్ పాటిల్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే వివిధ తండాలకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫ్లెక్స్ చైర్మన్ శ్రీకాంత్ ,అంబ్రేష్ ,మాజీ ఎంపిటిసి పండరినాథ్ పాటిల్, మాజీ సర్పంచ్ విట్టల్ రావు పాటిల్,అబ్దుల్ రహీం,పండరి, నారాయణ జాదవ్, మాజీ సర్పంచ్ అనిల్ పటేల్, సంతోష్ అంబాజీ, మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, సునీల్ పాటిల్ కాంగ్రెస్‌కార్యకర్తలు