calender_icon.png 10 February, 2026 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభ్యర్థి లింబాద్రి వినూత్న ప్రచారం

10-02-2026 01:06:05 AM

మెట్‌పల్లి 17వ వార్డులో మిషన్ కుట్టిన అభ్యర్థి

మెట్‌పల్లి, ఫిబ్రవరి 9(విజయక్రాంతి): పట్టణంలోని 17వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మైలారపు లింబాద్రి సోమవారం మిషన్ పై బట్టలు కూడుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను 17వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు సహకారంతో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని తెలిపారు. వార్డులో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్ డ్రైనేజీ, పనులు పూర్తి చేస్తానని పేర్కొన్నారు. మీ కుటుంబంలో ఒకరిగా మసలుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున తదిత రులు  పాల్గొన్నారు.