calender_icon.png 10 February, 2026 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రీ ఏఐ సమ్మిట్-2026

10-02-2026 01:06:33 AM

సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీ రింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం హైదరాబాద్ కళాశాలలో ఇనిస్టిట్యూషన్ ఇన్నో వేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం ‘ఫ్రీ ఏఐ సమ్మిట్ 2026’ ‘ఏఐ ఫర్ ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమం నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ జి నాగయ్య, సెక్రటరీ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, డైరెక్టర్ మిస్టర్ జి భగత్, ప్రిన్సిపల్ డాక్టర్ పి శేఖర్ బాబు, ఐఐసి కోఆర్డినేటర్ డాక్టర్ కండే శ్రీనివాస్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొ న్నారు. రిసోర్స్ పర్సన్ డాక్టర్ బరణి సేతుపాండ్యన్ మాట్లాడుతూ.. ఏఐ అనేది పిల్లలకు ఎంతో ఉపయోగకరమైనది అని, భవిష్యత్తులో ఏఐతోనే అన్ని పనులు చేసుకోవడానికి వీలవుతుంది అని తెలియజేశారు.