29-10-2025 12:00:00 AM
దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్
దేవరకొండ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ రహ్మత్ నగర్ డివిజన్ పరిధిలో బూత్ లెవెల్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ప్రజల గెలుపు అని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోంది.
అభివృద్ధి, సంక్షేమం, సమానత్వం ఇవే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయాలు అని ఈ అభివృద్ధి యాత్ర కొనసాగాలంటే నవీన్ యాదవ్ ను గెలిపించాలి, అని పిలుపునిచ్చారు. నవీన్ యాదవ్ కు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉందనీ, ప్రతి ఓటరు ఈసారి కాంగ్రెస్ పట్ల నమ్మకాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేస్తే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎగురుతుందనీ నమ్మకం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,బూత్ స్థాయి నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.