31-01-2026 12:50:04 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట
నిజాంసాగర్, జనవరి,30 (విజయ క్రాంతి): రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ జోరుగా సాగింది.. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో పోటీ చేయబోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు..ఈ నామినేషన్ మహోత్సవానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులతో కలిసి బిచ్కుంద పార్టీ కార్యాలయం నుండి పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు..పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతీ కార్యకర్త పని చేయాలని, సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సత్తా చాటామో, అంతకు రెట్టింపు ఉత్సాహంతో అత్యధిక మెజారిటీ రాబట్టి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అని పిలుపునిచ్చారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలని, అదేవిధంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మనం చేపట్టిన పనుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ క్యాడర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపాలిటీనాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..