calender_icon.png 2 October, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరన్ ట్రావెల్స్‌కు గ్లోబల్ టూరిజం అవార్డు

02-10-2025 12:37:27 AM

రెండోసారి అవార్డును దక్కించుకుని రికార్డు

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): భారతదేశంలో అత్యంత విశ్వసనీయంగా, ఎన్నో బహుమతులు అందుకున్న ప్రముఖ ట్రావెల్ సంస్థలలో ఒకటైన సదరన్ ట్రావెల్స్, గ్లోబల్ టూరిజం అవార్డు-2025లో ‘బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్’పురస్కారాన్ని అందుకుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును సదరన్ ట్రావెల్స్ వరుసగా రెండోసారి గెలుచుకోవడం గర్వకారణంగా నిలిచింది.

గ్లోబల్ టూరిజం అవారడ్స్ పర్యాటక, హాస్పిటాలిటీ రంగాల్లో అత్యున్నత, ఆధునీకతకు గౌరవం తెలిపే అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం. 2025 సంవత్సరానికి సంబంధించిన ఈ వేడుక నోయిడాలోని ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహిం చబడింది. ఈ అవార్డుల ఎంపికను టూరిజం, హాస్పిటాలిటీ, విమానయాన రంగాలకు చెందిన గౌరవనీయులైన నాయకులు, దూరదృష్టి కలిగిన ప్రముఖులు సభ్యులుగా ఉన్న విశిష్ట జ్యూరీ ప్యానెల్ జాగ్రత్తగా నిర్వహించారు.

ఈ అవార్డును ఎస్‌టీఐసీ ట్రావెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ గోయల్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు రవి గోసేన్ కలిసి సదరన్ ట్రావెల్స్‌కు ప్రదానం చేశారు. సదరన్ ట్రావెల్స్  మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్ అలపాటి మాట్లాడుతూ .. “మేము రెండోసారి గ్లోబల్ టూరిజం అవార్డు అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. మా కస్టమర్ల విశ్వాసం, మా సంస్థ సిబ్బంది అంకితభావంతో చేసిన కృషికి ఇది గుర్తింపు” అన్నారు.