23-11-2025 12:00:00 AM
ఇందిరమ్మ చీరల పంపిణీలో మంత్రి సీతక్క
వెంకటాపూర్(రామప్ప), నవంబర్ 22 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలోని మహిళా సంఘాలకు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టి.ఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి లతో ఇందిరమ్మ చీరలను శనివారం పంపిణీ చేశారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
అనంతరం మండలంలోని మహిళా స్వయం సహాయక సంఘా లకు బ్యాంకు లింకేజి ద్వారా 195 సంఘాలకు రూ.26 కోట్ల 50 లక్షలు రుణాల చెక్క ను మంత్రి సీతక్క అందచేశారు. మండల పరిధిలోని 43 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.