23-11-2025 12:00:00 AM
నల్లగొండ, నవంబర్ 22 (విజయక్రాంతి): కోటి మంది మహిళలను కోటీశ్వ రులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం, బస్సులు, పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ ద్వారా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేందుకు చర్యలు తీసుకుంటున్నదని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
ఇందులో భా గంగానే రైస్ మిల్లుల కొరతను దృష్టిలో ఉంచుకొని మహిళా సంఘాల ద్వారా రైస్ మిల్లులను నిర్వహించే బాధ్యతను కూడా వారికి అప్పగించాలని ఆలోచించినట్లు తెలిపారు. ప్రభుత్వమే మహిళా సంఘాలకు రుణం మంజూరు చేసి ఆర్ అండ్ బి శాఖ ద్వారా రైస్ మిల్లులు నిర్మిస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. శనివారం అయ న నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదీత్య భవన్‌లో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ఇందిర మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. మహిళలను కోటీశ్వరులను చేయడంలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడా లేనివి ధంగా పైలెట్ పద్ధతిన నల్లగొండ జిల్లాలో మహిళల చేత రైస్ మిల్లులు ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ఇందుకుగాను అవసరమై న స్థలాలను చూడాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమం త్రి దృష్టికి తీసుకువెళ్లి వచ్చే క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా రైస్ మిల్లులు ఏర్పాటు చేసే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునేలా చూస్తామని తెలిపారు.
మహిళలు స్వయంకృషితో పైకి వచ్చేందుకు పెట్రో ల్ పంపులు కేటాయించామని, నల్లగొండ జిల్లాలో రద్దీ ప్రాంతంలో ఎస్‌ఎల్బీసీలో ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపు ద్వారా ప్రతినెల 10 లక్షల ఆదాయం పొందడానికి అవ కాశం ఉందన్నారు. వచ్చే 3 సంవత్సరాల్లో నల్లగొండ నియోజకవర్గంలో పదివేల ఇం డ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హఫీజ్ ఖాన్, ఇన్చార్జి డిఆర్‌ఓ అశోక్ రెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.