29-07-2025 03:17:46 PM
మందమర్రి,(విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందే రాంచందర్ స్పష్టం చేశారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో లబ్ధి దారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేసి మాట్లాడారు. గత బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అర్హులైన ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాదినాల పాలనలో నిరుపేదలకు రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుంద న్నారు.