calender_icon.png 12 August, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరసనల వేళ రెండు బిల్లులకు లోక్‌సభ ఆమోదం

12-08-2025 01:37:20 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 11: లోక్‌సభలో రెండు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ట్యాక్సీషియన్ ట్యాక్స్ బిల్లు, ట్యాక్సీషి యన్ చట్టాలు (సవరణ) బిల్‌కు సభ ఆమోదం తెలిపింది. ఆదాయపు పన్ను బిల్లులో 1961 చట్టంలో పలు సవరణలు చేశారు.

ఈ రెండు బిల్లులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. సోమవారం ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు నిరసనలు చేస్తుండగానే అధికార పక్షం ఈ రెండు బిల్లులకు ఆమోదం తెలపడం గమనార్హం. ఈ రెండు బిల్లుల ఆమో దం అనంతరం లోక్‌సభ నేటికి వాయిదా పడింది.