calender_icon.png 12 August, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ డిప్యూటీ సీఎంకు ఈసీ నోటీసులు

12-08-2025 01:35:52 AM

డబుల్ ఓటర్ ఐడీ ఆరోపణల నేపథ్యం 

పాట్నా, ఆగస్టు 11: బీహార్ ఉపముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఈసీ బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు నోటీసులు జారీ చేసింది. ‘సిన్హాకు నోటీసులు జారీ చేశాం. ఆయన రెండు ప్రాం తాల్లో ఎందుకు ఓటర్ ఐడీ కలిగి ఉన్నారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నాం’ అని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.

విజయ్ కుమార్ సిన్హాకు రెండు నియోజకవర్గాల్లో ఓటరు కార్డులున్నాయని ఆరోపించిన తేజస్వీ ఒక దాంట్లో అతడి వయసు 57 సంవత్సరాలుగా ఉండగా.. మరోదాంట్లో 60 సంవత్సరాలుగా ఉందని పేర్కొన్నారు. బీహార్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. సీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపెను దుమారం రేపుతోంది.