28-07-2025 12:37:02 AM
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
పెద్దఅంబర్ పేట్‌లో పౌల్ట్రీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ భవనం ప్రారంభం
అబ్దుల్లాపూర్‌మెట్, జులై 27: పౌల్ట్రీ పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభు త్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్‌లో తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
ఈ కా ర్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డిలతో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల చెందిన పౌల్ట్రీ పరిశ్రమల య జమానులు, ప్రతినిధులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారె డ్డి మాట్లాడుతూ.. బిల్డింగ్ నిర్మాణం పౌల్ట్రీ రైతులకు చక్కటి వరం లాంటిదన్నారు.
పౌల్ట్రీ పరిశ్రమ కమర్షియల్ ఇండస్ట్రీ కాకుండా రైతుల పరిశ్రమగా భావించి ప్రభుత్వం అన్ని విధాలా స హాయ సహకారాలు అందిస్తుందన్నారు. మున్ముందు పౌల్ట్రీ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ పితామహుడు బీవీ రావు చేసిన సేవ లు మరువలేనివని కొనియాడారు.
పౌల్ట్రీ రైతులకు విద్యుత్ సబ్సిడీ అలాగే హెచ్‌ఎండీఏ పరిధిలోని నిర్మించే షెడ్ల పర్మిషన్లు సంబంధించిన విషయాలను సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానని హామీనిచ్చారు. అలాగే పౌల్ట్రీ పరిశ్రమల సమస్యలను సీఎం దృష్టి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో రోడ్డు డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరె డ్డి, రాష్ట్ర అధ్యక్షులు కాసర్ల మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి భాస్కర రావు, జక్క సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, కా సిరెడ్డి నారాయణరెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్‌కుమార్, దలే సుధాకర్, గుర్రం చంద్రశేఖర్‌రెడ్డి, డా. దివ్య కుమార్ గులాటి మహారాష్ట్ర, రణపాల్ ధండా (హర్యానా), డా. జితేంద్ర వర్మ (కర్ణాటక), నవాబ్ అలీ అక్బర్ (ఉత్తరప్రదేశ్), శుభం బాలకృష్ణ మహలే (అమరావతి), రాజు నంబ్రాదర్ (ఢిల్లీ), మధుసూదన్‌రావు( తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్), కేవీ సుబ్బారావు (ఆంధ్రప్రదేశ్) తెలుగు రాష్ట్రాల పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు, వ్యాపారులు, డాక్టర్లు తదితరులుపాల్గొన్నారు.