28-07-2025 12:38:48 AM
గత ప్రభుత్వం హాయంలో నాసిరకం పనులు
నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం
వికారాబాద్, జులై 27( విజయక్రాంతి ) తాండూర్ నియోజకవర్గంలోని తాండూర్-కొడంగల్ ప్రధాన రహదారిలోని కాగ్న వంతెనకు రంద్రం పడడం వాహనదారులను భయాందోళనకు గురిచేస్తుంది. గత ప్రభుత్వం హాయంలో చేపట్టిన ఈ కాగ్న నది వంతెన పనులు నాసిరకంగా జరిగిన ట్లు ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కాం ట్రాక్టర్ నాసిరకం పనులు చేసినట్లు అప్ప ట్లో ఆరోపణలు వచ్చిన ప్రజాప్రతినిధులు గానీ అధికారులు గానీ పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యపు ఫలితమే ఇప్పుడు కనిపిస్తుందని తాండూరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు వాహనాల రాకపోకలతో బిజీగా ఉండే వంతెన పై రంద్రం పడటంతో వా హనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఏదో ఒక సమయంలో వంతెన పూర్తిగా దెబ్బతింటుందని అంటున్నారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కాగ్న వంతెనను పరిశీలించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలనను ఆయన తీవ్రంగా ఎండగట్టారు.కమిషన్ల కోసం నిర్మాణాల పేరుతో చేసిన పనులు ప్రజల ప్రాణాలను ముప్పుగా మారాయి అన్నారు. వంతెన నాసిరకం పనుల ఫలితంగా ఎప్పుడైనా ప్రమాదం జరగే అవకాశం ఉందన్నారు.
వంతెన నిర్మాణంలో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, కంక్రీటు పనులు తక్కువ బలంతో జరిగా యని, కాలమ్లు బలహీనంగా ఉన్నాయని ఆయన గుర్తించారు. వరదల సమయంలో వంతెన నిర్మాణ స్థిరత్వంపై తీవ్ర సందేహాలు ఉన్నట్లు తెలిపారు.తాండూర్ పెద్దేముల్ రహదారిలో గాజీపూర్ వంతెన కూడా ఇదే స్థితిలో ఉండటం బాధాకరంఅన్నారు.