calender_icon.png 28 July, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లు చారిత్రాత్మక పథకం

28-07-2025 12:36:54 AM

  1. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

రైతులకు సరిపడా యూరియా అందించే బాధ్యత ప్రభుత్వానిది

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

భద్రాద్రి కొత్తగూడెం, జులై 27, (విజయక్రాంతి):భారీ వర్షాలు వరదలను ఎదుర్కొ నేందుకు యాక్షన్ ప్లాన్ తో అధికారులు సి ద్ధంగా ఉండాలని, ఇందిరా సౌర జల వికా సం పథకం కింద రైతులకు సోలార్ పంపు లు, డ్రిప్ స్పింకులర్లు ఉద్యాన పంటల సాగు కు ఉచితంగా సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు స్ప ష్టం చేశారు.

ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలవుతున్న ప్రభు త్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై పాల్వంచ లోని ఐ డిఓసి సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టి విక్రమార్క తో పాటు ఉమ్మడి ఖ మ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకాటి శ్రీహరి, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మ రియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులు గా హాజరయ్యారు.

సమీక్షలో జిల్లాల్లో వర్షాభావం, వరద ముంపు, సీజనల్ వ్యాధులు, ఎరువుల సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం, రేషన్ కార్డుల పంపిణీ, వనమహోత్సవ కార్యక్రమం, విద్యా రంగ అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించబడింది. భ ద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రులకు జిల్లాల ప్రస్తుత పరిస్థితులపై వివరాలు ఇ చ్చారు.

ఈ సమీక్ష సమావేశంలో ఉప ము ఖ్యమంత్రి మాట్లాడుతూ. .ఇందిరా సౌర జలవికాసం పథకం కింద మూడు సంవత్సరాల్లో రూ.12,600 కోట్లు ఖర్చు చేసే ఈ పథకం ద్వారా గిరిజన రైతుల అభివృద్ధి జరుగుతుందన్నారు.ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేపల పెంపకాన్నిప్రోత్స హించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ పాఠశాలలు 25 ఎకరాల స్థలంలో ని ర్మించాలని, ఈ పాఠశాలలు ఇతర విద్యా సంస్థలకు ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చే యాలన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై వర్షాకాలంలో ప్రత్యేక దృష్టి అవసరమని, వైద్య పరీక్షలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పేదల సంక్షేమానికి, పేదలను ఆర్థికంగా అభివృద్ధి పరచ డానికే మహాలక్ష్మి పథకం, రూ 500 కే గ్యాస్ బండ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారన్నారు .

భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రూ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. దీనికిగాను ప్రతి సోమవారం వారం నిధులు విడుదల చేస్తున్నామన్నారు. మహిళలను వ్యాపార వేత్తలుగా చేయడానికి గాను బ్యాంకు లింకేజీ ద్వారా రూ లక్ష కోట్ల రుణాలు మంజూరు చే సే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

చేప పిల్లల పంపిణిలో ఈ సం వత్సరం ప్రయోగాత్మకంగా మహిళా సంఘా ల ద్వారా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు స్థాపించడం ద్వారా వారిని అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టామన్నారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకాటి శ్రీహరి మాట్లాడుతూ..

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పని చేయాలని అన్నారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని, రైతుల సమస్యలపై ప్ర భుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, యూరియా తక్కువ ఉన్నట్టు తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు విద్యాభివృద్ధికి మలుపు తిప్పే కార్యక్రమమని అభివర్ణించారు.

ఆగస్టు రెండో వారం లో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపడతామన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తూ ప్రస్తుతం110 ఎం ఎం చేప పిల్లలు పంపిణీ చేయడంతో పాటుగా, కౌంటింగ్ ప్రకారం అందజేయడం జరుగుతుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువు గట్ల పైన చెరువు సామర్థ్యం, ఎన్ని చేప పిల్ల లు పెంపకం చేపడుతున్నాం, వాటి యొక్క ఉత్పత్తి ఎక్కడ నుంచి వాటి ఖర్చు తదితర పూర్తి వివరాలు సంబంధించిన బోర్డులు ఏ ర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు తో పాటు ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలో ఐదు మొక్కలను నాటే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ

రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి మోడల్గా తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు సమన్వయంతో పనిచేయాలని అ న్నారు. గత పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు లేవన్న ఆయన, ఈ ప్రభుత్వం రైతు లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరి యా సరఫరా చేయడంపై కట్టుబడి ఉందన్నారు. వరదలు, వర్షాలకు సంబంధించి అ న్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. జిల్లాలో సరిపడినంత యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెంద వలసిన అవసరం లేదన్నారు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

అధికారులు ప్రజా సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుంచు కొని పనిచేయాలని అన్నారు. వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్క సంరక్షణ చేపట్టాలన్నా రు. రెవెన్యూ శాఖలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఆగస్టు 15 నాటికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎం పిక పూర్తి చేసుకుని పంపిణీ చేయు విధంగా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు నెలలో శ్రావణమాసం సం దర్భంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు జరిగేటట్లు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను సరఫరా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతివారం ఇందిరమ్మ ఇండ్లకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదవారి సంక్షేమం కోసం రూపొందించిన పథకం అ న్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకోవలసిన బా ధ్యత స్థానిక ప్రజాప్రతినిధుల పైన ఉందన్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని పెండింగ్ లో ఉన్న అన్ని పనులను త్వరిత గతను పూర్తి చేయాలన్నారు.

రహదారుల వెంట ఏర్పడిన గుంటలను పూ డ్చాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నీరు కలుషిత మయ్యే అవకాశం ఉందని, అలా జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించా రు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు.తీసుకోవాలన్నారు. ఆస్పత్రులు, వసతి గృహాలు పర్యవేక్షించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అ ధికారిని నియమించి, ప్రతి నెల ఒక ప్రణాళిక ద్వారా ఆసుపత్రులు వసతి గృహాలు పరిశీలించి నివేదికలు అందచేయాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్ ఐఏఎస్, ఎస్పి రోహిత్ రాజు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురా మ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ స భ్యులు పోరిక బల రాం నాయక్, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వ ర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనక య్య,

అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, సత్తుపల్లి శాసనసభ్యులు మ ట్టా రాగమయి, అటవీ శాఖ అభివృద్ధి కా ర్పొరేషన్ చైర్మన్ వీరయ్య, టిజిఐడిసి చైర్మన్ మువ్వ విజయ్ బాబు, జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.