21-01-2026 12:39:20 AM
దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ
దేవుండ్ల పేరు చెప్పి ఓట్లు అడిగే నైజo బీజేపీది
యువత అభివృద్ధి కి కృషి చేసిన చరిత్ర బీజేపీకి లేదు
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
కామారెడ్డి, జనవరి 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ సిద్ధాంతమే ఇందిరమ్మ మార్గమని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీ ఇందిర చౌక్ లో ఇందిరమ్మ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ అని ఆమె త్యాగం వేల కట్టలేనిదని అన్నారు.
బిజెపి మాత్రం శ్రీరాముడు ఆంజనేయుడు పేర్లు చెబుతూ ఓట్లు అడుగుతు న్నారు తప్ప అభివృద్ధి మాత్రం చేసింది ఏమీ లేదన్నారు. బిజెపికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. యువతకు ఉపాధి కల్పించిన దాఖలాలు లేవని, కేవలం రామ భజన పేరుతో ఓట్లు దండుకుంటున్నారన్నారు. బిజెపికి రాబోయే ఎన్నికల్లో దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కామారెడ్డి గడ్డపై ఇందిరమ్మ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నీ మరింత బలోపేతం చేయాలన్నారు. ఆనాడు ఇందిరమ్మ ప్రవేశపెట్టిన 20 సంవత్సరాల పథకమే నేడు అనేక సంక్షేమ పథకాలకు పునాది అని గుర్తు చేశారు.
అనంతరం కింగ్స్ ఫంక్షనల్లో సర్పంచులు, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. రాజకీ యంగా ఎదిగేందుకు సర్పంచ్ స్థానం ఒక గీటు రాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి సేవ చేయాలన్నారు. సర్పంచిగా సక్సెస్ అవుతే భవిష్య త్తులో మంచి లీడర్ గా అభివృద్ధి చెందుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటుచేసిన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మహాత్మ గాంధీ పేరును తొలగించేం దుకు బిజెపి ప్రభుత్వం చూస్తుందని జనవరి 26న జెండా వందనం పూర్తయిన తర్వాత బిజెపి మహా త్మా గాంధీ ఉపాధి హామీ పథకంకు పేరును తొలగించవద్దని తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సర్పంచ్లను కోరారు. బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూ ర్వకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలను మార్చేందుకు ప్రయత్నిస్తుతోందన్నారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్ట పడ్డాడు...కాబట్టే అధికారంలోకి వచ్చాము అని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తు న్నాం. మాజీ ప్రధాని నెహ్రూను మరిపించే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. ప్రధాని మోడీ శ్రీరాముని పేరు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఇవాళ శ్రీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నాడు. శ్రీ రాముడికి బీజేపీ లో సభ్యత్వం ఉన్నదా అని అడుగుతున్నాను. ఓట్లు వస్తే చాలు హిందూ ముస్లిం గొడవలు పెడతారు. రాముడి పేరుతో ఆంజనేయుడు పేరు చెప్పి బీజేపీ వాళ్ళు ఓట్లు దండుకుంటున్నారు. రాజకీయాలు దేవుడికి ఏం సంబంధం అన్నారు.
బీజేపీ ప్రభుత్వం బీద వారికి ఏం చేశారో చెప్పండి అని ప్రశ్నించారు. హిందువులుగా అందరం గౌరవించు కొందాం, దేవుళ్ళ పేరుతో కొట్టు కోవద్దు. రాజకీయాలకు దేవుడితో ముడి పెట్టాద్దు. భవిష్యత్తు తరాలు చాలా నష్టం పోతారు. కామారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపాలిటీ ల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి 5,70, 000 లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్ర అభివృద్ధి చేశారు. ప్రజలు సంకేమ పతకాలతో సంతృ ప్తి ఉన్నారు. కాబట్టే సర్పంచ్ ఎన్నికల్లో భారీ గెలుపు నిచ్చారన్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ దైవసం చేసుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దేవునిపల్లి మాజీ సర్పంచ్ నీట్టు వెంకట్రావు, ముప్పారపు ఆనంద్, రవి, తాజా మాజీ కౌన్సిలర్ నీట్టు కృష్ణ మోహన్ రావు, లకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం కామారెడ్డి, భిక్కనూర్, దోమకొండ, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, మండలాల సర్పంచులు సర్పంచులను సన్మానించారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీ రెడ్డి మహేందర్ రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లు ధర్మగోని లక్ష్మి, రాజు, మాజీ సిడిసి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.