calender_icon.png 27 September, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్

27-09-2025 02:09:22 AM

  1. కోటా అంశాన్ని సీఎం రాజకీయం చేస్తున్నారు..
  2. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): హామీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల హక్కులను కాపాడినప్పుడే ప్రజలు కాంగ్రెస్‌ను నమ్ముతారని,  రేవంత్‌రెడ్డి బీసీ కోటా అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతు న్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలనే ఆలోచ న కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు.  మంత్రివర్గంతో పాటు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం వాటా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.