calender_icon.png 27 September, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకారం పేరిట స్వాహాకారం

27-09-2025 02:09:43 AM

  1. గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆడిట్ లేదంట

ఏండ్ల తరబడి నోటి లెక్కలే.. 

అనధికార పోస్టుదారుడి లీలలేనా..!

మంచిర్యాల, సెప్టెంబర్ 26 (విజయక్రాం తి): మంచిర్యాలలోని రిజిస్టర్డ్ ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో ఏండ్లు గడిచినా ఏం జరుగుతుందో తెలియనివ్వకుం డా పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధుల అండతో అనధికారికంగా ఒక పోస్టు క్రియేట్ చేసుకొని అవినీతి దందా నిర్వహిస్తూ  లక్షలకు లక్షలు దండుకుంటున్నాడు.  ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం సుమారు 45 ఏండ్ల ముందు నుంచి కొనసాగుతుంది. 

ఈ సంఘంలో కొందరు దొంగలు చేరి సహకారాన్ని కాస్త ‘స్వాహాకారం’ చేస్తున్నారు. ఈ అవినీతి, అక్రమాలపై సంఘంలోని సభ్యుడు ప్రజావాణి లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. దానిని ఎక్సు జ్ శాఖకు పంపి నెల రోజులైనా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గీతకార్మికు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంఘంలోని ఒకరు తనను తాను కన్వీనర్‌గా ప్రకటించుకొని అనేక అవకతవలకు పాల్పడుతూ అమాయక కార్మికులపై పెత్తనం చెలాయిస్తూ, లక్షల రూపాయలు తీసుకుంటున్నా డే తప్ప సంఘానికి ఇప్పటి వరకు కనీసం స్వంత భవనం నిర్మాణానికి స్థలం కూడా కేటాయించలేదని, వారి గురించి పట్టించుకో వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నోటి లెక్కలే..

సంఘానికి చెందిన ఒకరు 2015 నుంచి నేటి వరకు జమా ఖర్చులు,  లాభ నష్టాలు, ఆస్థి, అప్పుల వివరాలకు సంభందిచి సం ఘం ఆడిట్ నివేదిక ఇవ్వాలని ఆగస్టు 12న జిల్లా సహకార సంఘ కార్యాలయంలో సమాచారానికి దరఖాస్తు చేయగా కార్యాలయ ఆడిట్ అసిస్టెంట్ రిజిస్టర్ మా వద్ద ఎలాంటి వివరాలు లేవని, ఎటువంటి ఆడిట్ నిర్వహించలేదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.

నోటి లెక్కలే తప్పా లెక్కాపత్రం లేదనేది స్పష్టమవుతుంది. ఈ విషయంపై ‘విజయక్రాంతి’ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్సుజ్ కో ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ దేవేందర్‌ను వివరణ కోరగా కో ఆపరేటివ్ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఆడిట్ చేసినట్లు కాపీ ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు.