02-05-2025 01:44:15 AM
కార్మికులకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మేడే శుభాకాంక్షలు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): ఉత్పత్తిలో భాగమై, జాతి సంపదను వృద్ధి చేస్తున్న సబ్బండ కులాల శ్రామికుల, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల రెక్కల కష్టాన్ని వెలకట్టలేమని, వారి త్యాగం అసమాన్యమైందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మేడే సందర్భంగా కేసీఆర్ గురువారం ఓ ప్రకటనలో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
మేడే స్ఫూర్తితో రాష్ట్రంలోని శ్రామి కుల హక్కులను కాపాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు వారి జీవన భద్రతకు భరోసానిచ్చాయన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామి క విధానాలు అమ లు చేసి, ప్రపంచ పె ట్టుబడులు ఆకర్షించామని కేసీఆర్ పే ర్కొన్నారు.
లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. సింగరేణి కార్మికులు, ఆటోడ్రైవర్లు, పలు పరిశ్రమలు, అసం ఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామికులకు భరోసా కల్పించామన్నారు. బీఆర్‌ఎస్ అమలు చేసిన విధానాలను మరింత బలోపేతం చేస్తేనే మే డే స్ఫూర్తికి, ప్రపంచ కార్మికలోక త్యాగాలకు మనం అందించే ఘన నివాళి అని కేసీఆర్ అన్నారు.