02-07-2025 12:37:37 AM
బూర్గంపాడు, జూలై1(విజయక్రాంతి):వర్షం పడిందంటే చాలు ఆ దారిలో నడవడానికి కష్టాలు తప్పవు. బూర్గంపాడు మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్, ఎస్బిఐ బ్యాంక్, పోలీస్ స్టేషన్ కు వెళ్లే రోడ్డు గుంతలపడంతో కురిసిన వర్షం నీరంతా అక్కడికి చేరి నిలిచి పోయింది.
దీంతో ఆయా కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని వర్షం నీరు రోడ్డుపై నిలవకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.