calender_icon.png 2 July, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై పైనే రైతన్న ఆశ!

02-07-2025 12:15:29 AM

  1. జూన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం

ఆశించిన మేర కనిపించని పంటసాగు

కరీంనగర్, జూలై 1 (విజయ క్రాంతి): వానాకాలం వ్యవసాయ సీజన్ ఆరంభమై నా, వర్షం కురవకపోవడంతో ఆశించిన మే ర పంటల సాగు కనిపించడం లేదు. జూన్ నెలల్ సాధారణం కంటే 20 శాతం తక్కువగా కరీంనగర్ జిల్లాలో వర్షపాతం నమో దయింది. రుతుపవనాలు ముందే తాకినా జూన్ నెలలో వర్షాలు ఆశాజనకంగా కురియలేదు. వర్షాధారం కింద ప్రస్తుత సీజన్లో భారీగా వరితోపాటు ఇతర పంటలు సాగు చేస్తారు.

జిల్లాలో వర్షం రైతులు ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు పడలేదు. జూన్ మాసం అన్నదాతలకు ఎలాంటి మేలు చేయకుండానే వెళ్లిపోయింది. జూన్ 29, 30, ఈ నెల 1న ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో పత్తి విత్తనాలు వేసిన రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుత సీజన్లో లో జి ల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు సగటున 124.5 మిల్లీ మీటర్లు ఉండాల్సి ఉండగా 99.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

జూన్ మొత్తంలో 7 రోజులే వర్షపాతం నమోదయింది. ఇదే 2024 జూన్ నెలలో 208.3 మిల్లీ మీటర్ష వర్షం కురిసింది. ఇది సాధారణకంటే 67 శాతం అధికం. గత ఏడు 13 రోజులు వర్షాలు కురిశాయి. జిల్లాలో 16 మండలాలు ఉండగా 13 మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదయింది.

జూన్ నెలలో మానకొండూర్, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో మాత్రమే సాధారణ వర్ష పాతం నమోదయింది. అత్యల్పంగా చొప్పదండి మండలంలో సాధారణం కంటే 47 శాతం తక్కువగా వర్షపాతం నమోదయింది.

- సిరిసిల్లలో - 33 శాతం నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాలే దు. జూన్ నెలలో జిల్లా సాధారణ వర్షపాతం 127.5 మిల్లీ మీటర్లు కాగా 84.5 మి ల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. ఇది సాధారణంకంటే 33 శాతం కంటే తక్కువ. ఇదే సీజన్లో గత సంవత్సరం జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ 167.8 మిల్లీ మీ టర్ల వర్షపాతం నమోదయింది.

జిల్లాలో మొత్తం 12 మండలాలు ఉండగా బోయినపల్లి మండలంలో సాధారణం కంటే -51 శాతం నమోదయింది. తదుపరి వేములవా డ రూరల్ -45, వేములవాడ అర్బన్ -43 శా తం నమోదయింది. కేవలం ఇల్లంతకుంట, కోనరావుపేట మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతంనమోదయింది.