02-05-2025 01:11:10 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఐటీసెల్ తనపై దుష్ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన తెలంగాణ సీఎంఓ, తెలంగాణ డీజీపీలను ట్యాగ్ చేస్తూ గురువారం పోస్టు పెట్టారు.
పాలన చేతకాదు, సమాధానం చెప్పే దమ్ములేదు, కానీ దుష్ప్రచారంలో నెంబర్ వన్ కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఐటీ సెల్ ద్వారా చేస్తున్న వికృత చేష్టలు అని, దివాలా కోరు, దిగజారుడు రాజకీయాలని హారీష్ రావు ఫైర్ అయ్యారు. ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోకపోతే, చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తమని ఆయన హెచ్చరించారు.
దేశానికి వెన్నెముక శ్రామిక శక్తి
‘కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింప జేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్త్ర వృత్తుల సమస్త చిహ్నాలు’ అంటూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్బంగా కార్మిక లోకానికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మేడే శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వెన్నుముక శ్రామిక శక్తి, వారి అవిశ్రాంత, అంకిత భావానికి గుర్తింపుగా నిలిచిన రోజే కార్మిక దినోత్సవం అని గురువారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.