02-05-2025 01:10:32 AM
నారాయణఖేడ్ , మే 1: జిల్లాలో ప్రసిద్ధి చెందిన బోరంచ నల్ల పోచమ్మ జాతర మ హోత్సవ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ జాతర ఉత్సవాలు ఏడు వారాల పాటు కొనసాగనుంది. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యే క పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. జాతర సందర్భంగా ఆలయ కమిటీ, ఎండోమెంట్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు. మొదటి గురువారం అయినందున వివిధ ప్రాంతాల భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.