02-07-2025 12:24:21 AM
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు
కామారెడ్డి, జూలై 1 (విజయక్రాంతి), జూలై 4న హైదరాబాదులో నిర్వహించనున్న ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి నియోజక వర్గం నుంచి 600 మంది తరలి రావాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు కోరారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు హైదరాబాద్ లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించ నున్న ముఖ్య కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ గారికి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకుల ను ఉద్దేశించి మాట్లాడుతారని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ప్రతి నియో జకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, ధర్మగోని రాజ గౌడ్, లక్కపతిని గంగాధర్, కిరణ్ కుమార్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కామారెడ్డి* టిపిసిసి అధ్యక్షులు గౌరవ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు తేదీ సి 4-7-2025 శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాదు లాల్ బహదూర్ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున ఖార్గే గారు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోపాటు కాంగ్రెస్ పార్టీ మరియూ అనుబంధ సంస్థల నాయకుల ను కార్యకర్తలను ఉద్దేశించి గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయనైనది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పాల్గొంటారు సమావేశానికి ప్రతి నియోజకవర్గం నుండి సుమారు 600 మంది కాంగ్రెస్ పార్టీ మరియు అనుబంధ సంస్థ లనాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. *కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ తెలిపారు పాల్గొన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, పంపరి లక్ష్మన్, రాజగౌడ్, లక్కపత్ని గంగాధర్, పడిహర్ కిరణ్ కుమార్, సుధాకర్ వున్నారు.