calender_icon.png 24 August, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీపీపీ ఆధ్వర్యంలో వైద్య శిభిరం

23-08-2025 08:33:06 PM

జైపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టిపిపి) ఆధ్వర్యంలో ప్రభావిత గ్రామాల్లో వరుసగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా శనివారం జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామ పంచాయతీ భవనంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టీపీపీ ఈడి సిహెచ్ చిరంజీవి మాట్లాడుతూ ప్లాంట్ పరిసర గ్రామాల ఆరోగ్య పరిస్థితులు అంచనా వేసేందుకు, వ్యాధులను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపట్టేందుకు ఇలాంటి శిబిరాలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. ప్రజలందరు క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య రక్షణకు సింగరేణి యాజమాన్యం పెద్దపీట వేస్తోందన్నారు. అనంతరం వైద్య బృందం శిబిరానికి వచ్చిన వారికి రక్తపోటు, మధుమేహం, కంటి సమస్యలు వంటి వ్యాధులను గుర్తించి తగిన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.