calender_icon.png 11 January, 2026 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునుగోడు నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ కళాశాలలు ఏర్పాటు చేయాలి

10-01-2026 12:47:32 AM

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

మునుగోడు, జనవరి 9 (విజయక్రాంతి): వెనకబడిన మునుగోడు నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ కళాశాలలను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలను ఏర్పాటు చేయాలంటూ  హైదరాబాదులో ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యని కలిసి రిప్రజెంటేషన్ అందజేసి మాట్లాడారు. 

నియోజకవర్గంలోని మునుగోడు, చండూరు, మర్రిగూడెం, ఘట్టుప్పల్ మండల కేంద్రాలలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు ఏర్పాటు చేయాలనీ ఆయనను కోరారు.మునుగోడు నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన నియోజకవర్గం అని మండలానికి ఇంటర్ కళశాల ఉంటే పేద విద్యార్థులు  ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుందని వీలైనంత తొందరగా ఆయా మండల కేంద్రాలలో ప్రభుత్వ ఇంటర్ కళశాలల ను ఏర్పాటు చేయాలనీ కోరారు.