02-10-2025 12:00:00 AM
తూప్రాన్, అక్టోబర్ 1 :తూప్రాన్ మహంకాళి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గా భవాని మాత వద్ద మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చందాయిపేట సర్పంచ్ బుడ్డ భాగ్యరాజ్ తన మిత్రులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గా భవాని సేవా సమితి అధ్యక్షుడు శాడ కోటేశ్వరరావు, సర్పంచ్ బుడ్డ భాగ్యరాజ్ ను ఘనంగా శాలువాతో సన్మానించి, మెమెంటో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గా భవాని మాత ఆశీస్సులతో బుడ్డ భాగ్యరాజ్ కుటుంబ సభ్యులు ఆయు రారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ డాక్టర్ అప్సర్ భాయ్, లయన్ కుమ్మరి రమేష్, గెంటియాల నాగరాజు, పన్నీరు రాము, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాబోయే సర్పంచ్ అక్బర్ భాయ్, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్ తదితరులు పాల్గొన్నారు.