calender_icon.png 2 October, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడితే ఫలితం తప్పక వస్తుంది..!

02-10-2025 12:00:00 AM

జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు

మెదక్, అక్టోబర్ 1 (విజయక్రాంతి):కష్టపడితే ఎవరైనా విజయం సాధించవచ్చని గ్రూప్ -1 లో ఉద్యోగాలు పొందిన వారే ఉదాహరణ అని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపా రు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రూప్-1 డీఎస్పీ ఉద్యోగం సాధించిన శైలేష్, ప్రభా త్ రెడ్డి, ప్రణయ్ సాయిలను జిల్లా ఎస్పీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కష్టపడి చదివి డీఎస్పీ ఉద్యోగం సాధించిన ముగ్గురిని అభినందించారు.

వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగం సాధించడానికి ఎంత కృషి చేశారో, ప్రజలకు సేవ చేయడంలో కూడా అంతే శ్రమ చూపాలన్నారు. త ల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. అలాగే కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యం అయినా సాధించవచ్చని, సమాజంలో పేరు ప్రతిష్టలు పొందవచ్చని అన్నారు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అదే పట్టుదలతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఫిర్యాదుదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. తెలంగాణ పోలీస్ దేశంలోనే ఉత్తమ పోలీస్ వ్యవస్థగా నిలిచిందని, మీరు ఆ కుటుంబంలో చేరి గౌరవాన్ని మరింత పెంచేలా నడుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.