calender_icon.png 4 August, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ప్రజలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 వాగ్దానాలు ఇచ్చిన కాంగ్రెస్

04-08-2025 12:00:00 AM

ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ ఇన్చార్జి ప్రియాంక కక్కర్

ముషీరాబాద్, ఆగస్టు 3(విజయక్రాంతి): కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో 420 వాగ్దానాలు ఇవ్వడం ద్వారా తన ఉద్దేశాన్ని స్పష్టం చేసుకుందని  ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి ప్రియాంక కక్కర్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా  సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్,

రాష్ట్ర కాన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, బుర్రా రాములు గౌడ్,  విజయ్ మల్లంగి లతో కలిసి మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ జీ మాత్రమే హామీలు ఇస్తాడు, ఇతరులు ఆయనను కాపీ చేస్తారని, కానీ ఓటర్లకు వారు ఇచ్చే వాగ్దానాలను అమలు చేయలేరన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాదిరిగా కాకుండా, రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ బాధ్యతను రాష్ట్రంలోని పురుషులు, విద్యార్థులపై వేస్తున్నార న్నారు. 

ఇప్పుడు బస్ పాస్‌ల కోసం 40 రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు. తెలంగాణ తన పౌరుల నుండి అత్యధిక పన్నులు వసూలు చేస్తుందని, ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఈ డబ్బును తెలంగాణ పౌరులకు ఖర్చు చేయాలన్నారు. రేవంత్ రెడ్డికి ప్రతి నెలా 6వేల యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది, కానీ తాను హామీ ఇచ్చినట్లుగా అన్ని ఇళ్లకు 200 యూనిట్లు ఇవ్వడానికి బదులుగా, అ తను ఇన్వర్టర్ కంపెనీలకు విద్యుత్ కోతలు,

వ్యాపారాన్ని ఇస్తున్నాడన్నారు. రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తాడన్నారు. కల్యాణ లక్ష్మి పథకంలో 10 గ్రాముల బంగారం ఇస్తానని రేవంత్ రెడ్డి కూడా అబద్ధం చెప్పాడన్నారు. దీనిని అమలు చేయకపోవడమే కాకుండా ఆయన కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని కూడా ఆపాడన్నారు. రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం నుండి వచ్చారన్నారని, బిజెపి సిద్ధాంతాలను అనుసరి స్తారని ప్రియాంక కక్కర్ విమర్శించారు.