calender_icon.png 4 August, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హాస్టళ్ల అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలి

04-08-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మాలని చూస్తున్న ప్రభుత్వం
  2. ప్రభుత్వ హాస్టళ్లు,  గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య
  4. ఇందిరా పార్కులో వందలాది మందితో విద్యార్థుల ధర్నా

ముషీరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న హాస్టల్లో అద్దె బకాయిలను చెల్లించాలని, ప్రభుత్వ భూములు వేలం వేసి అమ్మాలని ప్రభుత్వం చూస్తుందని, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని జాతీ య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఇట్టి స్థలాలను హాస్టళ్లు,  గురుకులాలు సొంత భవనాలు కట్టడానికి వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్ల పెళ్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్  ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు అమ్మ రాదు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు సొంత భవనాలు నిర్మించాలని,  అద్దెబకాయలు చెల్లిం చాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లా డుతూ సొంత భవనాలు లేకపోవడం వలన అద్దే భవనాలలో నిర్వహిస్తున్నారని,  అద్దె భవనాలలో చాలీచాలని వసతులతో విద్యార్థులు కిక్కిరిసి ఉన్నారన్నారు. ప్రభుత్వ స్థలా లను అమ్ముతే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. కాలేజీ హాస్టల్ విద్యార్థులకు బస్సు పాస్ ఇతర చిల్లర ఖర్చులకు ప్రతి ఒక్కరికి నెలకు బాలికలకు రూ. 1000, బాలురకు రూ.800 పాకెట్ మనీ మం జూరు చేయాలన్నారు.

హాస్టళ్లకు ముగ్గు రు వర్కర్లు సరిపోవడం లేదని ప్రతి హాస్టల్ అదనంగా ఇద్దరు వర్కర్లను మంజూరు చేయాల న్నారు. 100 కంటే ఎక్కువ ఉంటే ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక వర్కర్ చొప్పున పెంచాలన్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎం సీఏ, ఫార్మసీ, పీజీ, డిగ్రీ, ఇంటర్ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు పగిళ్ల సతీష్ కుమార్, శివ, అనంతయ్య, సి.  రాజేందర్, జి. మల్లేష్ యాదవ్, పృధ్వి గౌడ్, రవి కుమార్ యాదవ్, మణికంఠ, నిఖిల్, ఆశిష్ గౌడ్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.