17-09-2025 12:00:00 AM
నిజామాబాద్ డీసీసీబీ అధ్యక్షుడు రమేష్‌రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి మంగళశారం సందర్శించి, బ్యాంకు పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీసీసీబీ అధ్యక్షుడు కుంట రమేష్‌రెడ్డి నాయకత్వంలో బ్యాంకు అభివృద్ధి తీరు అద్భుతమని కొనియాడారు.
ఇదివరకు ఉన్న నిరర్ధక ఆస్తులను 17.35 శాతం నుండి 7.81 శాతమునకు తగ్గించారని, జిల్లా సహకార రంగం పునర్వైభవం దిశలో రమేష్‌రెడ్డి నాయకత్వం అజరామరం అన్నారు. ఇదే విధమైన పనితీరు మున్ముందు కనబరిచి రాష్ట్ర స్థాయి లో ముందు వరుసలో ఉండాలని దిశా నిర్దేశం చేశారు. పూర్తిగా సహకరించి క్షేత్ర స్థాయిలో అమలుపరిచి అధ్భుత ఫలితాలకు సహకరించిన ముఖ్య కార్యనిర్వాణాధికారి, ఉన్నతాధికారులను, సిబ్బందిని అభినందించారు.
వారి నేతృత్వంలో జిల్లా రైతాంగానికి సహకార సంఘాల ద్వారా, సహకార బ్యాంకు ద్వారా విశేష సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం జిల్లాకి కోటా ప్రకారం రావలసిన 75,000 టన్నుల యూరియాలో 71,000 టన్నులు ఇదివరకే వచ్చిందని, మిగిలిన యూరియా కూడా త్వరలోనే వస్తుందని తెలిపారు.
ఆయన వెంట రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా అధ్యక్షుడు కేశ వేణు, రాష్ట సహకార యూనియన్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ అధ్యక్షుడు అంతరెడ్డి రాజారెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి వాజీద్ హుస్సేన్ ఉన్నారు.