calender_icon.png 27 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టిలో మాణిక్యాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

27-12-2025 12:56:45 AM

  1. మండల వర్కింగ్ ప్రెసిడెంట్

చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు

బీసీ సెల్ మండల అధ్యక్షులు

ముతినేని ఆదినారాయణ

మంగపేట,డిసెంబర్,26 (విజయక్రాంతి) మంగపేట మండలం చేరుపల్లి ఎదురుగట్ల రామస్వామి కొడుకు ఎదురుగట్ల రాజ్ కుమార్ అథ్లెటిక్స్ రన్నింగ్ విభాగం లో సికింద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించి మెడల్ తీసుకున్నాడు,అదేవిధంగా ఇదే కాలనీకి చెందిన యెంపెల్లి ఎల్లయ్య కుమారుడు యెంపెల్లి రంజిత్ అథ్లెటిక్స్ జావిలిన్ త్రో విభాగంలో హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి పోటీలో రెం డో ర్యాంక్ సాధించి మెడల్ తీసుకున్నారాని తెలిసిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు,

మరియు కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ మంగపేట మండల అధ్యక్షులు ముతినేని ఆదినారాయణ మరియు తెలంగాణ అంబేద్కర్ సంఘం మంగపేట మండల అధ్యక్షులు యెంపెల్లి వీరస్వామి చె రుపెల్లి గ్రామస్థులతో కలిసి వారి ఇంటికి వెళ్లి వారి పేరెంట్స్ సమక్షంలో శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలియ జేయడం జరిగింది.ఈ సందర్బంగా చెట్టుపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, అట్టడుగు పేద దళిత కుటుంబంలో పుట్టిన ఈ యువకులు మా రుమూల కు గ్రామం నుండి రాష్ట్ర స్థాయి రెండో ర్యాంక్ సాధించడం చాలా అభినందించ దగ్గ విషయం అని వీరిని గ్రామంలో ఉన్న యువకులు ఆదర్శం గా తీసుకొని చె డు అలవాట్లకు దూరంగా ఉండి మంచి మా ర్గంలో నడవాలని తెలియజేశారు.

వీరి ప్రతిభని రాష్ట్ర మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లి నేషనల్ స్థాయిలో రానించడానికి సహాయ సహకారాలు తీసుకుంటామని తెలియజేశా రు. అదేవిధంగా బిసి సెల్ మండల అధ్యక్షులు ముతినేని ఆదినారాయణ మాట్లాడు తూ వీరు రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సా ధించిన మా గ్రామానికి గొప్ప పేరు తీసుకువచ్చారని వీరు ఇంకా ఉన్నత శిఖరాలకు చే రుకోవాలని, గ్రామస్థులందిరి సహాయ, స హకారలు ఉంటాయాని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ రామ్మోహన్,ఎదురుగట్ల రామస్వామి,తెలంగాణ అంబేద్కర్ సంఘం కమలాపురం గ్రామ అధ్యక్షులు దాసరి బుజ్జి, గ్రామస్థులు యెంపెల్లి తరుణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.