27-12-2025 12:55:16 AM
వెంకటాపురం(నూగూరు), డిసెంబర్ 26(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండలం కేంద్రంలో గెస్ట్ హౌస్ సమీపంలోని పార్టీ దిమ్మ వద్ద జెండా ఆవిష్కరణ సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మా ట్లాడిన ఆయన పార్టీ పుట్టి 100 సంవత్సరాలు గడిచినా పేద ప్రజలలో చెక్కుచెదరకుండా అభిమానం ఉన్నదని ఈ సందర్భంగా తెలిపారు.
జనవరి 18 వ తారీఖున ఖమ్మంలో జర గబోయే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని, కా ర్మిక సోదరులను, అన్ని ప్రజాసంఘాల నాయకులను సానుభూతిపరులను, అభిమానులను కోరారు. ఇదే సందర్భంగా మహిళలు ఎర్ర చీరలు ధరించి, పురుషులు ఎర్ర చొక్కా ధ రించి అధిక సంఖ్యలో హాజరై ఈ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.
ఇదే సందర్భంగా సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క రు వారికి తోచిన సహాయం అందించాలని కోరారు. మా కార్యకర్తలు తమ ఇళ్ల వద్దకు వచ్చి వి రాళాలు సేకరిస్తారని, అందుకు మీరు స్పందించి కమ్యూనిస్టులకు మీకు తోచిన సహాయం అం దించాలని కోరారు. పేదలకు అన్యాయం ఎదిరించేది కమ్యూనిస్టు పార్టీ అని, పార్టీలను ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా అందరికీ మనవి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్సి కట్ల రాజు, ఆనారాయణ, బొల్లె నరసింహరావు, అప్పాల సత్యం,సిహెచ్ లక్ష్మీనారాయణ, మహిళా కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.