calender_icon.png 10 September, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో ప్రతిభ

09-09-2025 12:51:33 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్విజ్ కాంపిటీషన్ లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మం చిర్యాల కార్మల్ స్కూల్ విద్యార్థులు స్టేట్ లెవె ల్‌లో సెకండ్ ప్రైజ్ గెలుపొందారు. సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్ర య్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత తదితరులు కలెక్టరేట్ మీటింగ్ హాలులో విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు రూ. 8 వేల నగదు బహుమతి, ప్రశంస పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, డెమో భుక్క వెంకటేశ్వర్లు, దిశా సీపీఎం నీలిమ, కార్మెల్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ రెనెట్, జీవశాస్త్ర ఉపాధ్యాయులు హోలీ బాహ్, విద్యార్థులు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పాల్గొన్నారు.