30-01-2026 02:11:47 AM
ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న పార్టీ నేతలు
జాబితా ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లకు ప్రకటించింది. 20 మంది స్టార్ క్యాం పెయినర్లతో కూడిన జాబితాను పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ గురువారం ప్రక టించారు. స్టార్ క్యాంపెయినర్స్ జాబితాతో పాటు స్క్రీనింగ్ కమిటీని కూడా వెల్లడించారు. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్ రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధ ర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జి. వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, పీసీ సీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీచంద్‌రెడ్డి ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీని పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా మహేష్‌కుమార్‌గౌడ్ ప్రకటించారు. పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా ఇప్పటికే నియమించిన మం త్రులు చైర్మన్లుగా ఉండగా, ఆయా పార్లమెం ట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు, కొందరు సీనియర్లను కన్వీనర్లను నియమించారు.