calender_icon.png 30 January, 2026 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైన్ స్నాచింగ్ పుకార్లను నమ్మకండి

30-01-2026 02:12:57 AM

  1. అసత్య వార్తలు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు
  2. పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 29 (విజయక్రాంతి): నగరంలో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రంగా ఖండించారు. ఈ పుకార్లు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశా రు. ఈ మేరకు గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రజలు ఇలాంటి అసత్య వార్తలను నమ్మవద్దని కోరుతూ పోస్ట్ చేశారు.

బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నా చింగ్‌లు పెరిగాయని, పక్క రాష్ట్రాల నుంచి నేరగాళ్లు నగరానికి వచ్చారంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై సీపీ స్పందిస్తూ.. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఎవరూ ఫార్వార్డ్ చేయకండి. ఇలాంటి అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృ ష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితంగా ఉందని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యం త్రాంగం నిరంతరం శ్రమిస్తోందని సీపీ భరో సా ఇచ్చారు. ఏదైనా అనుమానం వస్తే లేదా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేయండి. నిశ్చింతగా ఉండండి అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాలను పోలీస్ ఐటీ సెల్ పర్యవేక్షిస్తోంది. పుకార్ల మూలాలను గుర్తిం చి, ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతోంది. ధృవీకరించని సమాచారాన్ని ఇతరు లకు పంపడం కూడా నేరమేనని, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.