calender_icon.png 30 January, 2026 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలపై పోరాటానికి ఏకమైన ఉపాధ్యాయ సంఘాలు

30-01-2026 02:11:14 AM

టీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి

5న పార్లమెంట్ మార్చ్‌కు మద్దతు

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పై పోరాటం చేయడానికి 35 ఉపాధ్యాయ సంఘాలు ఏకమయ్యాయని టీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి తెలిపారు.  పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం దామోదర్‌రెడ్డి, చావా రవి, జీ సదానందగౌడ్ అధ్యక్షతన ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 5న ఆలిండియా జాక్టో ఆధ్వర్యంలో జరిగే పార్లమెంట్ మార్చ్ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.

జాతీయ సమస్యలపై పోరాడేందుకు ఉపాధ్యాయలు ఢిల్లీకి రావాలన్నారు. పీవో 2018 ప్రకారం సర్వీస్ రూల్స్ విడుదల చేసి, డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలోని సంక్షోభాన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతన జిల్లాలకు డీఈవో, నియోజకవర్గానికి ఒక డిప్యూటీ ఈవో, నూతన మండలాలకు ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలన్నారు.

పెండింగ్ బిల్లులు, డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. 30 నెలలు గడుస్తున్నా పీఆర్సీ లేకపోకపోవడం దారుణమన్నారు. ఆరోగ్య కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, ఉపాధ్యాయుల అందరికీ ఈహెచ్‌ఎస్ పథకాన్ని వర్తింపచేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.