calender_icon.png 10 September, 2025 | 12:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూసు వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలి

09-09-2025 12:00:00 AM

ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఇరుప శీను

వెంకటాపురం (నూగూరు): వెంకటాపురం మండలంలోని సీతాపురం గ్రామంలో రోడ్లు, పూసూర్ వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం టిఏజిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం ఐటిడిఏ పిఓ చిత్రమిస్తాకి వినతి పత్రం అందజేసినట్లు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం టిఏజిఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఇరుప శీను తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సీతాపురం నుంచి ఆలుబాక వరకు రోడ్లు 4-2 రోడ్డుతో పాటు పూసుర్  వాగు కల్వర్టు  నిర్మా ణం కొరకు రూ. 3,59,000  మంజూరైనప్పటికీ ప్రారంభించలేని పరిస్థితి కనపడుతుందన్నారు. ఎన్నిసార్లు అధికారులకు తెలియజేసిన గాని  పేద ప్రజలకు రోడ్ల నిర్మాణం వేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

వర్షాకాలం వస్తే సీతారాంపురంలో ఉన్న గ్రామ ప్రజలు వాగులు ఉండటం వలన జ్వరం వచ్చిన, గర్భిణీ స్త్రీలు ఉన్నాగాని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సీతారాంపురం బావిలో బురద నీరు ఉండటం వలన పేద ప్రజలు అవే నీరు తాగి టైఫాయిడ్, మలేరియా, డెంగు లాంటి జ్వరాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయన్నారు.