calender_icon.png 11 May, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ లింగం

27-11-2024 01:27:48 PM

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలో వంటేరు సందీప్ రెడ్డి వయస్సు 32 సంవత్సరాలు,రెస్టారంట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొన్ని నెలల నుండి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడని నమ్మదగిన సమాచారంపై జగదేవపూర్ పోలీసులు బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ లింగం లొకేషన్ ద్వారా అతని ఇంటికి వెళ్లి ఇంటి డోరు పగలగొట్టి ఉరి నుండి కిందికి దించి అతను అపస్మారక స్థితిలో ఉండగా వెంటనే సిపిఆర్ చేసి స్పృహ రాగానే గజ్వేల్ ఆసుపత్రికి వారి బంధువులతో పంపించారు.

అక్కడ ప్రథమ చికిత్స చేసి తదుపరి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రస్తుతం సందీప్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడినందుకు సందీప్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, కానిస్టేబుల్ లింగమును అభినందించారు.త్వరలో పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రివార్డు అందజేయడం జరుగుతుందని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.